Tue Mar 17 2026 02:32:28 GMT+0530 (India Standard Time)
రణస్థలిలో హైపర్ ఆది పంచ్ లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజాయితీపరుడైన నాయకుడని జబర్దస్త్ ఫేం హైపర్ ఆది అన్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజాయితీపరుడైన నాయకుడని జబర్దస్త్ ఫేం హైపర్ ఆది అన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక గోల్ ఉందని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని తాను భావిస్తున్నానని తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, చిన్న గాయం ఏ కార్యకర్తకైనా ఆయన తట్టుకోలేరని అన్నారు.
చిన్న గాయమైనా...
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ గెలుపొందాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ ప్రాంతంలో కులాలు, మతాలు లేవని అన్నారు. అందరినీ ఒక్కటిగానే చూస్తారని అన్నారు. నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా చేసిన అనుభవం పార్టీకి మరింత శోభను చేకూరుస్తుందన్నారు. నాగబాబు తన సోదరులపై ఈగవాలినా సహించరని, ఆయన ప్రత్యర్థులు చేసే విమర్శలకు పంచ్ లు ఇస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నారని అన్నారు.
Next Story

