Sun Mar 15 2026 02:21:52 GMT+0530 (India Standard Time)
మూడు రూపాయలకే బిర్యానీ.. ఎగబడిన జనం
మూడు రూపాయలకే బిర్యానీ అని జంగారెడ్డి గూడెంలో ఒక హోటల్ నిర్వాహకులు ప్రకటించడంతో భారీగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు

మూడు రూపాయలకే బిర్యానీ అని ఒక హోటల్ నిర్వాహకులు ప్రకటించడంతో భారీగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఒక రెస్టారెంట్ ఓనర్ ఈ ఆఫర్ ను ప్రకటించారు. ఈ బంపర్ ఆఫర్ ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే ఉంటుందని ప్రకటించారు. ఒక వ్యక్తికి ఒక బిర్యానీయేనని ప్రకటించడంతో క్యూ కట్టారు.
జనం భారీగా చేరడంతో...
దీంతో జంగారెడ్డి గూడెం ప్రజలు ఒక్కసారిగా రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. మూడు రూపాయలకే బిర్యానీని సొంతం చేసుకునేందుకు క్యూ కట్టారు. వారిని అదుపు చేయడం కూడా కష్టంగా మారింది. నిర్వాహకులు వారిని అదుపు చేయలేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చి కొంత వరకూ పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
Next Story

