Wed Mar 18 2026 11:00:20 GMT+0530 (India Standard Time)
ఇంద్రకీలాద్రికి భారీగా చేరుకుంటున్న భవానీలు
ఇంద్రకీలాద్రికి భారీ సంఖ్యలో భవానీలు చేరుకుంటున్నారు. భవానీ దీక్షను విరమించడానికి పెద్దయెత్తున తరలి వచ్చారు

ఇంద్రకీలాద్రికి భారీ సంఖ్యలో భవానీలు చేరుకుంటున్నారు. భవానీ దీక్షను విరమించడానికి పెద్దయెత్తున తరలి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి భవానీ దీక్షలు చేపట్టిన వారు ఈరోజు దుర్గమ్మ సన్నిధిలో దీక్షను విరమిస్తారు. ముందుగా విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం దీక్ష విరమణ చేయనున్నారు.
దీక్ష విరమణ కోసం...
భవానీల దీక్ష విరమణ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేడు దసరా ఉత్సవాలు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సాయంత్రం తెప్పోత్సవంతో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
Next Story

