Wed Jan 28 2026 21:56:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రాంబిల్లి సెజ్ లో భారీ పేలుడు.. ఒకరి మృతి
అనకాపల్లి జిల్లా రాంబల్లి సెజ్ లో భారీ పేలుడు సంభవించింది.

అనకాపల్లి జిల్లా రాంబల్లి సెజ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈరోజు ఉదయం వసంత కెమెకల్స్ లో రియాక్టర్ పేలడంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. మరణించిన కార్మికుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అయితే కార్మికులు పని చేస్తున్న సమయంలో రియాక్టర్ పేలడంతో భయాందోళనలకు గురయిన కార్మికకులు బయటకు పరుగులు తీశారు.
గాయపడిన వారిని...
స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

