Sun Mar 15 2026 12:12:36 GMT+0530 (India Standard Time)
వ్యాన్ బోల్తా.. బయటపడిన క్యాష్ బాక్స్ లు.. తెరిచి చూస్తే ఏడు కోట్లు
తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. అనంతపల్లి వద్ద వ్యాన్ బోల్తాపడటంతో ఈ విషయం వెల్లడయింది

తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. అనంతపల్లి వద్ద వ్యాన్ బోల్తాపడటంతో ఈ విషయం వెల్లడయింది. హైదరాబాద్ నుంచి మండపేటకు వెళుతున్న లారీ నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఏడు పెట్టెలతో కూడిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొట్టడంతో...
నగదును ఏడు పెట్టెలలో తీసుకెళుతుండగా వ్యాన్ బోల్తా పడింది. కెమికల్ పౌడర్ వ్యాన్ బోల్తా పడటంతో పెట్టెలతో పాటు భారీగా నగదు కూడా బయటపడింది. వ్యాన్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరి కోసం ఈ నగదును తీసుకెళుతున్నారన్న దానిపై విచారణ చేపడుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.
Next Story

