Thu Mar 19 2026 04:13:14 GMT+0530 (India Standard Time)
Breaking : అనంతపురంలో రెండు కోట్ల నగదు స్వాధీనం.. ఎవరిది అంటే?
అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది. ఈ నగదు రెండు కోట్ల రూపాయలు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు

అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది. ఈ నగదు రెండు కోట్ల రూపాయలు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అనంతపురంలోని ప్రధాన సర్కిల్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యానులో బ్యాగుల్లో ఉంచిన నగదును గమనించిన పోలీసులు వెంటనే రిటర్నింగ్ అధికారికి తెలియజేశారు.
వ్యాన్ డ్రైవర్ ను...
పోలీసులు నగదుతో పాటు వాహనం డ్రైవర్ నుకూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది ఎన్నికలలో ఉపయోగించేందుకు తీసుకెళుతున్న నగదుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదును లెక్కించడానికి లెక్కింపు యంత్రాలను తీసుకు వచ్చిన అధికారులు ఎంత నగదును తీసుకెళుతున్నారన్న దానిపై మరికాసేపట్లో స్పష్టత ఇవ్వనున్నారు.
Next Story

