Thu Mar 19 2026 04:27:06 GMT+0530 (India Standard Time)
జగన్ పై చేసిన వంగలపూడి అనిత వ్యాఖ్యలు వింటే?
హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ అధినేత జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు

హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ అధినేత జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. తాను ముఖ్యమంత్రి కావడం కోసం సొంత బాబాయినే హత్య చేసిన వాడు తల్లిని, చెల్లిని మోసం చేయడని ఎలా అనుకోవాలని వంగలపూడి అనిత ప్రశ్నించారు. అందుకే ఆస్తులను పంచకుండా కోర్టులకు కెక్కాడంటూ వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు.
అనుకున్నట్లే జరిగిందని...
విజయనగరం జిల్లాలో పర్యటించిన వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఏదో రోజు తల్లి, చెల్లిపై కేసులు పెడతాడాని అనుకున్నామన్నారు. అనుకున్నట్లే జరిగిందన్నారు. జగన్ కి తల్లి, చెల్లి పై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అందరికీ అర్థమైందన్న అనిత .వైసీపీ నాయకులు జగన్ గురించి ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటున్నారన్నారు.
Next Story

