Sat Mar 21 2026 02:05:34 GMT+0530 (India Standard Time)
ఏపీ హైకోర్టులో హోంగార్డులకు ఊరట
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హోంగార్డులకు ఊరట లభించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హోంగార్డులకు ఊరట లభించింది. కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

పెద్ద రిలీఫ్ గానే...
దీంతో హైకోర్టులో హోంగార్డులకు రిలీఫ్ దక్కినట్లయింది. కానిస్టేబుళ్ల నియామకాల్లో వీరికి ప్రత్యేక కేటగిరీగా పరిణగించడంతో పాటు నియామకాల్లో ప్రయారిటీ ఇచ్చేందుకు హైకోర్టు ఉత్తర్వులు దోహదపడ్డాయి. కానిస్టేబుల్ అయ్యేందుకు ముందు హోంగార్డులుగా చేరేందుకు ఇష్టపడతారు. అందుకే అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న పిటీషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

