Fri Mar 13 2026 19:03:45 GMT+0530 (India Standard Time)
మాజీ డీజీపీ హెచ్.జె దొర మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ డీజీపీగా పనిచేసిన హెచ్.జె దొర మృతి చెందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ డీజీపీగా పనిచేసిన హెచ్.జె దొర మృతి చెందారు. కిడ్ని సంబంధిత సమస్యలకు చికిత్స పొందుతు కొద్ది సేపటి క్రితం హైదరాబద్ లోని నిమ్స్ లో తుది శ్వాస విడిచారు. 1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన హెచ్‌జే దొర 1965 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన అధికారి.
వివిధ పదవులను...
కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా హెచ్‌జే దొర సేవలందించారు. 1996లో డీజీపీగా పదోన్నతి పొందిన హెచ్‌జే దొర 2002లో సీఐఎస్ఎఫ్ డీజీగా డిప్యుటేషన్‌పై వెళ్లారు. ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ సీపీగా సేవలందించిన హెచ్‌జే దొర మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Next Story

