Sat Dec 06 2025 00:09:06 GMT+0000 (Coordinated Universal Time)
జగన్పై బాలకృష్ణ సంచలన కామెంట్స్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సినీనటుడు, హిందూపూరం బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సినీనటుడు, హిందూపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనకు మెగా బైట్ కు, గిగా బైట్ కు తేడా కూడా తెలియదన్నారు. సలహాదారుల మాట కూడా జగన్ వినడన్న బాలకృష్ణ వైసీపీలో బబుల్ బద్దలవుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జగన్ ఇంకా పిచ్చిపిచ్చిగా చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. కేంద్రం నుంచి కనీసం నిధులను కూడా తీసుకు రాలేకపోతున్నారని, ప్రజలు ఓట్లేసి వైసీపీని గెలిపించారని ముఖ్యమంత్రి బాదుడే బాదుడికి గురి కాని వ్యక్తి ఒకరైనా ఉన్నారా? అని బాలకృష్ణ ప్రశ్నించారు.
పాలించడం చేతకాదు...
జగన్ కు పాలించడం చేత కాదని, సలహాదారులను పెట్టుకున్నా, వారి మాటను వినడని బాలకృష్ణ విమర్శించారు. సలహాదారులు కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారున్నారని అన్నారు. తమ మాటను జగన్ వినకపోతుండటంతో సలహాదారులంతా జీతాలు తీసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ పాదయాత్రను ఎందుకు చేపట్టారో దాని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, దాని ఫలితాన్ని మీరంతా స్వీకరించాలని బాలయ్య అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పుడు మీలో ఉన్న ఈ ఆవేశం ఆయన మీ జిల్లా దాటిపోయిన తర్వాత కూడా ఉండాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీకి చెంపపెట్టని అన్నారు.
Next Story

