Sun Mar 15 2026 17:24:36 GMT+0530 (India Standard Time)
కందుకూరు ఘటనపై బాలయ్య విచారం
కందుకూరులో జరిగిన ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కందుకూరులో జరిగిన ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తన మనసును కలచి వేసిందని బాలయ్య పేర్కొన్నారు. జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం బాధాకరమని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
పాడె మోయాల్సి రావడం...
చంద్రబాబు సభలో నిన్న జరిగిన ఘటనలో ఎనిమిది మంది మరణించడం ఎనభై లక్షల కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపిందని బాలయ్య పేర్కొన్నారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.
Next Story

