Fri Dec 05 2025 19:55:23 GMT+0000 (Coordinated Universal Time)
High Court : వైసీపీ కార్యాలయాల కూల్చివేత పై నేడు తీర్పు
వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాల్లోని ప్రతిపక్ష వైసీపీ కార్యాలయాలను కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులకు నోటీసులు అందచేశారు. దీంతో వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో ఉన్న వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
21 పార్టీ కార్యాలయాలు...
నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేశామని, అయితే ఏదైనా నిబంధనలను ఉల్లంఘిస్తే తాము జరిమానాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు వైసీపీ తరుపు న్యాయవాదులు వివరించారు. 21 పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు వరకూ స్టే విధించింది. తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు వీటిపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది. తీర్పు ఎలా వస్తుందోనన్న టెన్షన్ లో వైసీపీ నేతలున్నారు.
Next Story

