Thu Dec 18 2025 10:09:37 GMT+0000 (Coordinated Universal Time)
Ys viveka murder case : నేడు విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. A4 నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తరపున నిన్న సీనియర్ కౌన్సిల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు.
నేడు సునీత...
అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ లో తమ వాదనలు వినాలని వివేకా కూతురు సునీత కోరారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను కూడా హైకోర్టు అనుమతించింది. నేడు సునీత వాదనలతో పాటు సీబీఐ వాదనలు హైకోర్టులో జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 కి విచారణ జరిగే అవకాశముంది.
Next Story

