Fri Dec 05 2025 16:54:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ
రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో మిధున్ రెడ్డిని ఇప్పటికే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు విచారణ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనను విచారించారు.
లిక్కర్ స్కామ్ కేసులో...
అయితే తనకు లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని, తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మిధున్ రెడ్డి సుప్రీంకోర్టు ఆశ్రయించగా, హైకోర్టులోనే తేల్చుకోవాలని చప్పింది. దీంతో ముందస్తుబెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరుగుతుంది. అదే సమయంలో సిట్ అధికారులు కూడా మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేయాలని కౌంటర్ దాఖలు చేశారు.
Next Story

