Thu Mar 19 2026 09:58:50 GMT+0530 (India Standard Time)
High Court : నేడు చంద్రబాబు బెయిల్ పై తీర్పు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు వెలువడనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి కేసుల్లో తీర్పు నేడు వెలువడనుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
మూడు కేసుల్లోనూ...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెలువడనుంది.
Next Story

