Tue Jan 20 2026 16:52:04 GMT+0000 (Coordinated Universal Time)
కొండపల్లి ఎన్నికపై హైకోర్టు ఏమన్నదంటే?
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు తీర్పు చెప్పింది. రేపు ఛైర్మన్ ఎన్నికను జరపాలంటూ అధికారులను ఆదేశించింది.

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు తీర్పు చెప్పింది. రేపు ఛైర్మన్ ఎన్నికను జరపాలంటూ అధికారులను ఆదేశించింది. ఎన్నికను జరిపిన తర్వాత తమకు నివేదికను సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. కౌన్సిలర్లకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని ఇన్ ఛార్జి పోలీస్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది.
టీడీపీ పిటీషన్ పై...
కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా తలపడ్డాయి. అయితే ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 22వ తేదీన జరగాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తుంది. దీనిపై టీడీపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని పేర్కొంటూ టీడీపీ వేసిన పిటీషన్ పై విచారించిన హైకోర్టు రేపు ఎన్నికను నిర్వహించాలని ఆదేశించింది.
Next Story

