Sat Mar 07 2026 21:57:10 GMT+0530 (India Standard Time)
ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శికి ఎన్్బీడబ్ల్యూ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఎన్్బీడబ్ల్యూ జారీ చేసింది. విద్యాశాఖలో బిల్లుల చెల్లింపుపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంపై కొందరు వేసిన పిటీషన్ ను న్యాయస్థానం విచారించింది. బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని న్యాయవాది అంబటి సుధాకర్ రావు వాదించారు.
విచారణకు...
అయితే ఈ విచారణకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, విద్యాశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ హాజరయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ మాత్రం విచారణకు హజరు కాలేదు. దీంతో గైర్హాజరయిన సత్యనారాయణకు హైకోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది.
Next Story

