Fri Jan 30 2026 17:17:43 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభకు అనుమతి
అమరావతి రైతులు తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే కొన్ని ఆంక్షలు విధించింది.

అమరావతి రైతులు తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే కొన్ని ఆంక్షలు విధించింది. బహిరంగ సభ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే జరుపుకోవాలని చెప్పింది. తిరుపతి రూరల్ పరిధిలో ఈ సభను జరుపుకోవడానికి హైకోర్టుల అనుమతిచ్చింది.
చంద్రబాబుతో సహా....
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర పూర్తి చేసుకున్న రైతులు ఈ నెల 17వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. కానీ పోలీసులు అందుకు అనుమతివ్వలేదు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఎల్లుండి తిరుపతి లో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు తమకు మద్దతిచ్చిన రాజకీయ పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశముంది.
Next Story

