Sat Dec 06 2025 03:20:55 GMT+0000 (Coordinated Universal Time)
అంబటిపై కేసు పెట్టండి : హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది

ధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సంక్రాంతి డ్రా పేరుతో సత్తెనపల్లిలో వసూళ్లకు పాల్పడిన కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లను బలవంతంగా అమ్మకాలు చేపట్టినట్లు జనసేన పార్టీ ఆరోపించింది. దీనిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.
లక్కీ డ్రా పేరుతో...
అయితే పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. మరి పోలీసులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

