Sun Mar 15 2026 13:25:58 GMT+0530 (India Standard Time)
మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి
అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది.

అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ ఈ నెల 12వ తేదీన అమరావతి నుంచి అరసవల్లి వరకూ మహా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే పోలీసులు ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు.
షరతులతో....
అయితే దీనిపై అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మహాపాదయాత్ర షరతులతో కొనసాగించాలని పేర్కొంది. 600 మంది పాదయాత్రలో పాల్గొనాలని, వారి పేర్లు ఇచ్చి ఐడీ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ముగింపు రోజు సభకు అనుమతి కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు తెలిపింది. ఆ దరఖాస్తులను పోలీసులు పరిశీలించాలని పేర్కొంది.
Next Story

