Sat Mar 21 2026 22:19:47 GMT+0530 (India Standard Time)
Breaking : ఉండవల్లి పిటీషన్ విచారణ వాయిదా
మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే దీనికి సంబంధించిన నోటీసులు అందరికీ చేరలేదని పిటీషనర్ తెలిపారు.
ఎందుకు చేరలేదని...
పిటీషనర్ ఎందుకు చేరలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐకి అప్పగించాలన్న ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ కు సంబంధించి మరోసారి విచారణ చేయడానికి నిర్ణయించింది.
Next Story

