Fri Oct 11 2024 07:55:35 GMT+0000 (Coordinated Universal Time)
ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 21వ తేదీన విచారణ జరపుతామని తెలిపింది. ఎల్లుండి ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాల వాదనలను వింటామని హైకోర్టు తెలిపింది. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ ఎల్లుండికి వాయిదా పడింది.
స్కిల్ డెవెలెప్మెంట్ కేసులో...
అయితే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో మాత్రం హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన చంద్రబాబుపై నమోదయని కేసులను కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే చంద్రబాబు తరుపున వాదనలను వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమయని ఆయన వాదిస్తున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా ముందుగా అరెస్ట్ చేయకూడదని ఆయన ఈ సందర్భంగా పలు కేసులను ఉదహరించారు. ఇంకా వాదనలను కొనసాగుతున్నాయి.
Next Story