Fri Dec 19 2025 00:27:42 GMT+0000 (Coordinated Universal Time)
అంగళ్ల కేసు : ఎల్లుండికి వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదయిన అంగళ్లు కేసు విచారణను ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదయిన అంగళ్లు కేసు విచారణను ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది. అంగళ్ల కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టకుండానే హైకోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
ముందస్తు బెయిల్...
చిత్తూరు జిల్లా అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్దయెత్తున ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. బెయిల్పై కొందరు బయటకు వచ్చారు కూడా. చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ ఎల్లుండికి వాయిదా పడింది
Next Story

