Mon Mar 09 2026 11:06:26 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిబిఐ విచారణ చేయాలని అంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిబిఐ విచారణ చేయాలని అంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణజరగనుంది. ఈ కేసుని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేసే అధికారం లేదు అంటూ ఎమ్మెల్యే ఎంపీ ప్రజాప్రతినిధుల కోర్టుకి ఈ కేసును బదిలీ చేయాలి అంటూ వేసిన మరో పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది.
అక్రమాలు.. అవినీతి అంటూ...
ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, పేర్కొంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్లు వేశారు. ఈ కేసులో తమకి ఏ విధమైన చార్జిషీట్ తదితర డాక్యుమెంట్లు ఇవ్వకుండా ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేయాలి అంటూ ఒత్తిడి చేస్తున్నారు అంటూ వేసిన మరో పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది. ఈ మూడు కేసులను ఫిర్యాదుదారుడు రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మరియు జస్టిస్ వై లక్ష్మణ్ రావు వాదనలు విననున్నారు.
Next Story

