Sun Mar 15 2026 14:49:51 GMT+0530 (India Standard Time)
పవన్ కు హీరో నాని మద్దతు
జనసేన పార్టీకి హీరో నాని మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ గెలవాలని ఆకాంక్షించారు

జనసేన పార్టీకి టాలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టాలీవుడ్ హీరోల నుంచి బుల్లితెర నటులు కూడా జనసేనకు మద్దతు ప్రకటిస్తున్నారు. పిఠాపరంలో పవన్ కల్యాణ్ గెలవాలని వారు కోరుకుంటున్నారు. సాక్షాత్తూ చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ ను పిఠాపురం నుంచి గెలిపించాలని వీడియో సందేశం విడుదల చేశారు.
పెరుగుతన్న మద్దతు...
జనసేన పార్టీకి హీరో నాని మద్దతు ప్రకటించారు. పవన్.. మీరు పెద్ద రాజకీయ యుద్ధం చేస్తున్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. సినీ కుటుంబ సభ్యుడిగా మీ విజయం ఆశిస్తున్నానని నాని పేర్కొన్నారు. మీ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నానని హీరో నాని తెలిపారు. మీకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడుతున్నాయని, పవన్ సర్.. నా మద్దతు మీకే, ఆల్ ది బెస్ట్ అంటూ సినీ హీరో నాని ప్రకటించారు.
Next Story

