Wed Mar 25 2026 20:41:36 GMT+0530 (India Standard Time)
నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్
నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డివైడర్ ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ - విజయవాడ మధ్యలో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు ఐదారు కిలోమీటర్ల మేర వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి.
వాహనదారుల ఇబ్బందులు....
భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు క్రేన్ల సాయంతో రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయిన లారీని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరికాసేపట్లో ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశముంది.
Next Story

