Fri Dec 05 2025 21:52:46 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : ప్రకాశం బరాజ్ పైకి నో ఎంట్రీ
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విజయవాడ ప్రాంతమంతా నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. సభ జరిగే ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో ఎటువంటి డ్రోన్లు, బెలూన్లు ఎగురవేయకూడదని పోలీసులు ఆకాంక్షించారు. ప్రధాని పర్యటన పూర్తయ్యేంత వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ బెలూన్లు, డ్రోన్లు కూడా ఎగుర వేయకూడదని తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎవరూ నిరసనలు ప్రదర్శనలు చేయడం కానీ, ఆందోళనలకు దిగడం కానీ, వ్యతిరేకంగా నినాదాలు చేయడంపైనా నిషేధం విధించారు.
బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు...
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు అనుమతించిన వారిని మాత్రమే ప్రధాని వెంట వచ్చేందుకు వస్తున్నారు. ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. మరోవైపు విజయవాడలోనూ ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ప్రకాశం బరాజ్ పైకి కూడా ఈరోజు ఉదయం నుంచి బయట వ్యక్తులను అనుమతించడం లేదు. కేవలం వీఐపీ, వీవీఐపీ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.
Next Story

