Fri Dec 05 2025 09:57:28 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అలెర్ట్.. ఇలా రావాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. తిరుమలకు భక్తులు గత కొద్ది రోజుల నుంచి పోటెత్తుతున్నారు.దాదాపు నాలుగున్నర నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సులువుగా దర్శనం అయ్యేలా చూస్తున్నామని, క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తమిళనాడు నుంచి...
తిరుమలలో తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తిరుపతిలో ఎస్.ఎస్.డి. టోకెన్లు ప్రతి రోజూ మంజూరు చేస్తుండటంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద కూడా రద్దీ కనిపిస్తుంది. అదే సమయంలో కాలినడకన కూడా తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ముందుగానే కొనుగోలు చేసిన భక్తులతో పాటు టైమ్ స్లాట్ భక్తులు తరలి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఎందరు భక్తులు వచ్చినా దర్శనం సులువుగా అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హుండీ ఆదాయం....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. అదే సమయంలో రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంది. ఈరోజు సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,883 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,000 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story

