Tue Jan 20 2026 16:50:56 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఈరోజు ఏపీలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటన చేసింది. ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
ఈదురుగాలులు...
రాయలసీమ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పింది. రైతులు, పశువుల కాపర్లు పొలాల్లో చెట్ల కింద నిల్చోవద్దని, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించించిది.
Next Story

