Sat Mar 07 2026 19:34:41 GMT+0530 (India Standard Time)
Tirupathi : తిరుపతిలో భారీ వర్షం
తిరుపతిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి

తిరుపతిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గత ఐదు గంటలుగా భారీగా తిరుపతిలో వర్షం కురుస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు వర్షపు నీటితో నిండిపోయాయి. తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం...
కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ఇళ్ల నుంచి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ వద్ద కూడా నీరు నిలిచిపోయింది. ప్రయాణికులతో పాటు భక్తులు, తిరుపతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. చిన్న వాహనాలను రోడ్డుపైకి అనుమతించడం లేదు. భారీ వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. కొన్ని వాహనాలు వర్షపు నీటిలో చిక్కుకుని నిలిచిపోయాయి.
Next Story

