Thu Jan 29 2026 22:12:42 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరుగానూ, ఇంకొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఈ ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది.
ఈ ప్రాంతాల్లో....
నైరుతి బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వాతావరణ శాఖ ఏర్పడింది. దీని ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా , యానాంలలో రాయలసీమ లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Next Story

