Sat Mar 21 2026 08:30:42 GMT+0530 (India Standard Time)
నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పాఠశాలలకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పాఠశాలలకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఈరోజు పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. విద్యాసంస్థలు ఈరో్జు కూడా ఎవరూ తెరవవద్దని సూచించారు. దసరా పండగ పూర్తి కావడంతో ఈరోజు నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది.
విద్యాసంస్థలు తెరిస్తే...
అయితే భారీ వర్షాలు కురుస్తున్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం ఖచ్చితంగా తమ విద్యాసంస్థలను మూసివేయాలని కోరారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి పాఠశాలలను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు విద్యాసంస్థల యాజమాన్యాన్ని హెచ్చరించారు.
Next Story

