Fri Dec 05 2025 17:50:10 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురం జిల్లాలో భారీ వర్షం
అనంతపురం జిల్లాలో భారీ వర్షం పడుతుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి

అనంతపురం జిల్లాలో భారీ వర్షం పడుతుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. రాత్రి వర్షానికి వాగులు పొంగుతున్నాయి.ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో రాత్రి వర్షం పడింది. పెంచులపాడు-పొలికి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నిలిచిన రాకపోకలు...
రాత్రి నుంచి పెంచులపాడు-పొలికి మధ్య వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల మధ్య సంబంధాలు త తెగిపోయాయి. ఉరవకొండ శివారులో ఉద్ధృతంగా పారుతున్న బూదగవి చెరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పలు తోటలు ధ్వంసమయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Next Story

