Mon Feb 02 2026 04:10:16 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో భారీ వర్షాలు.. నీటితో నిండిన రహదారులు
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోని అనేక చోట్ల భారీ వర్షాలతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపైకి నీరు భారీగా చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
రాజమండ్రిలో....
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో భారీ వర్షం నమోదయింది. దీంతో రాజమండ్రిలో రోడ్లన్నీ జలపాతాలుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. స్థానిక ఎమ్మార్వో ఆఫీసులోకి వర్షపు నీరు చేరడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అకాల వర్షాలు ఇబ్బందికరంగా మారాయి.
Next Story

