Thu Mar 19 2026 07:41:46 GMT+0530 (India Standard Time)
Tirupathi : తిరుపతికి వెళ్లే రైళ్లు రద్దు
తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది, దీంతో పలు రైళ్లను రద్దు చేశారు

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. తిరుమలలో వర్షం కారణంగా శ్రీవారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్లో కాలేజీలకు సెలవు ప్రకటించారు. తిరుపతికి వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దుచేసింది. గత రెండు రోజుల నుంచి తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కొన్ని రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
భారీ వర్షంతో...
తిరుమలలో భారీ వర్షాలతో టీటీడీ అప్రమత్తమయింది. రెండో ఘాట్ రోడ్డులో మొబైల్ స్వ్కాడ్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. ఘాట్ రోడ్డును నిరంతరాయంగా ఈ బృందాలు తనిఖీ చేయనుంది. రెండో ఘాట్ రోడ్డులో అక్కడక్కడ మట్టిపెళ్లలు విరిగిపడుతుండటంతో జేసీబీల సాయంతో మట్టిపెళ్లలను తొలగిస్తున్నారు.
Next Story

