Sat Mar 07 2026 18:58:21 GMT+0530 (India Standard Time)
టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ కు గుండెపోటు
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కాకాని జేఎన్టీయూ కౌంటింగ్

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కాకాని జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్‌కు గుండె నొప్పి రావడంతో అతడికి ఏమైందా అనే టెన్షన్ మొదలైంది. చిలకలూరిపేట నియోజకవర్గ కౌంటింగ్ ఆరో టేబుల్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్ రమేశ్ కు గుండె నొప్పి వచ్చింది. వెంటనే 108 వాహనంలో ఆయనను తరలించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు, పారా మిలటరీ బలగాలు భారీగా మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.
Next Story

