Fri Dec 05 2025 22:48:36 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ భద్రతపై హైకోర్టు ఏమందంటే?
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది

వైసీపీ అధినేత వైెఎస్ జగన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి వైఎస్ జగన్ భద్రత విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తన భద్రతను జడ్ ప్లస్ కేటగిరి నుంచి కుదించడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో పాటు తనకు కేటాయించిన వాహనం కూడా మరమ్మతులకు లోనవుతుందని వైఎస్ జగన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం...
దీనిపై న్యాయమూర్తి వైఎస్ జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించవచ్చు కదా? అని ప్రశ్నించింది. వైఎస్ జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదినికోరారు. జామర్ ఏర్పాటుపై మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీనిపై తాము అధికారులతో మాట్లాడి న్యాయస్థానానికి తెలుపుతామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. వైఎస్ జగన్ పిటీషన్ పై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
Next Story

