Sat Dec 06 2025 00:06:16 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్-5 జోన్‌పై విచారణ వాయిదా
అమరావతి లో ఆర్ 5 జోన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 19న విచారణకు వాయిదా వేసింది.

అమరావతి లో ఆర్ 5 జోన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 19న విచారణకు వాయిదా వేసింది. ప్రభుత్వం, సీఆర్డీఏను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రాజధాని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని న్యాయవాదులు గుర్తు చేశారు.
తదుపరి విచారణను...
పిటిషనర్ తరపు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దేవదత్ కామత్, లాయర్లు ఆంజనేయులు, ఉన్నం మురళీధర్‌లు తమ వాదనలు వినిపించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని, అక్కడికి వెళ్లొచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని కూడా హైకోర్టు ప్రశ్నించింది. అయితే రాజధాని భూములపై మాత్రమే మాట్లాడుతున్నామన్న న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడతామన్న హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

