Thu Mar 19 2026 10:28:53 GMT+0530 (India Standard Time)
Janasena : హైకోర్టులో సింబల్ పై కొంత ఊరట... కొంత ఇబ్బంది
జనసేన పార్టీ గుర్తు గ్లాస్ సింబల్ పై హైకోర్టులో విచారణ జరిగింది

జనసేన పార్టీ గుర్తు గ్లాస్ సింబల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్లాస్ సింబల్ ను జనసేన పోటీ చేసే స్థానంలో వారికే గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తామని తెలిపింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలలో ఎంపీ అభ్యర్థులకు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మాత్రం గాజు గ్లాసు గుర్తును వేరే వారికి కేటాయించమని తెలిపింది.
మిగిలిన చోట్ల...
అయితే మిగిలిన చోట్ల, జనసేన అభ్యర్థులు లేని చోట్ల ఫ్రీ సింబల్ కావడంతో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తును కేటాయిస్తామని తెలిపింది. అంటే ఎన్నికల కమిషన్ చెప్పినట్లు మచిలీపట్నం, కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించమని తెలిపింది. ఇది కొంత వరకూ కూటమి పార్టీలకు ఊరట కానీ, మిగిలిన స్థానాల్లో మాత్రం గాజుగ్లాసు గుర్తు యధాతధంగా స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించనుంది.
Next Story

