Fri Jun 20 2025 01:10:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ
నేడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిటీషన్ వేశారు.

నేడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిటీషన్ వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అనుమతించాలని ఈడీ ఏసీబీ కోర్టులో పిటీషన్ వేసింది. ఈడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారించనుంది.సిట్ నుంచి ఇప్పటికే అన్ని వివరాలను ఈడీ తీసుకుంది.
మనీలాండరింగ్...
ఈ కేసులో పెద్దయెత్తున నిధులు విదేశాలకు మళ్లాయని, మనీలాండరింగ్ జరిగిందని భావించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు ఏడుగురిని విచారించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపించారు. కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ పై నేడు ఎలాంటి తీర్పు రానుందో తెలియాల్సి ఉంది.
Next Story