Sun Feb 01 2026 16:47:15 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైకోర్టులో బెయిల్పై విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. తన బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లి 37 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో జరుగుతున్న విచారణలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
ముందస్తు బెయిల్...
అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అసైన్డ్భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది. తన కేసులను కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టులో కీలక కేసులు ఉండటంతో టీడీపీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.
Next Story

