Thu Jan 29 2026 03:20:27 GMT+0000 (Coordinated Universal Time)
Pinnellli : నేడు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పై విచారణ
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటి వరకూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పై ఉన్నారు. ఆయనపై ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. సీఐపై కూడా దాడికి దిగారని పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేసి ఇటీవల పోలీసులు రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు.
నరసరావుపేటలో...
అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. అప్పటి వరకూ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నరసారావుపేటలోని వైసీపీ పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ నివాసంలో ఉన్నారు. ఇంటి బయట పోలీసులు కాపలా ఉన్నారు. హైకోర్టు తీర్పు మేరకు ఆయనను అదుపులోకి తీసుకుంటారా? లేదా? అన్నది తెలియనుంది.
Next Story

