Sun Mar 15 2026 11:13:17 GMT+0530 (India Standard Time)
నేడు వల్లభవనేని వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ
నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది.

నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసుతో పాటు పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్థన్ ను బెదిరించి, కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.
నేడు కౌంటర్ దాఖలు...
ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. అయితే ఆయన తనకు ఈ కేసులో ఏమాత్రం సంబంధం లేదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను అరెస్ట్ చేశారని, తనది అక్రమ అరెస్ట్ అని పిటీషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story

