Thu Mar 19 2026 08:49:32 GMT+0530 (India Standard Time)
ఆర్ 5 జోన్ పై నేడు విచారణ
ఆర్ 5 జోన్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది. జస్టిస్ కే ఎం జోసెఫ్ , అరుణ్ కుమార్ లు విచారించనున్నారు

ఆర్ 5 జోన్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది. జస్టిస్ కే ఎం జోసెఫ్ , జస్టిస్ అరుణ్ కుమార్ ధర్మాసనం ఈ పిటీషన్ విచారించనుంది. అమరావతి కేసుతో పాటు ఆర్ 5 జోన్ కేసునూ కలిపి విచారించడం సబబు అని సోమవారం ధర్మాసనం అభిప్రాయ పడటంతో నేడు విచారణకు రానుంది. శుక్రవారం లోగానే రెండు పిటీషన్లపై విచారణకు సంబంధిత ధర్మాసనం ముందు లిస్ట్ చేసేందుకు అనుగుణంగా సీజేఐ నుంచి తగిన సూచనలు తీసుకోవాలని రిజస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
రెండు పిటీషన్లు...
రెండు పిటిషన్లు ఒకే ధర్మాసనం విచారించాల్సి ఉంటుంది కాబట్టి... ఆమేరకు వ్యవహరించాలని జస్టిస్ అభయ్ ఒఖా పేర్కొన్నారు. ఈ పిటిషన్లను సీజేఐ ముందు ఉంచి... తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. కాగా ఇప్పటికే ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుండటంతో అమరావతి రైతులు త్వరితగతిన విచారణ ముగించాలని కోరుతున్నారు.
Next Story

