Fri Mar 20 2026 14:17:30 GMT+0530 (India Standard Time)
23న రాజధాని కేసు విచారణ
రాజధాని అమరావతి కేసు విచారణను ఈ నెల 23వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

రాజధాని అమరావతి కేసు విచారణను ఈ నెల 23వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని కేసును త్వరగా విచారణ జరపాలని అడ్వొకేట్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఈ నెల 23న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపిందని చెబుతున్నారు.
స్టే ఇవ్వాలంటూ...
రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శాసనసభ నిర్ణయాలను తప్పుపడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, రైతులు మాత్రం తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని రైతుల తరుపున వాదిస్తున్నారు. త్వరగా విశాఖకు తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసును త్వరితగతిన ముగించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
Next Story

