Wed Mar 18 2026 11:03:36 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు కేసులపై నేడు హైకోర్టులో విచారణ
తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల సందర్భంగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండటంతో పోలీసులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై రాష్ట్రంలో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో తెలపాలని అందులో కోరారు.
నమోదయిన కేసుల వివరాలు...
పోలీసు అధికారుల పై నమ్మకం లేక చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రేపు న్యాయపరంగా తన నామినేషన్ కు ఇబ్బందులు కలగకుండా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story

