Sun Mar 15 2026 13:27:03 GMT+0530 (India Standard Time)
వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైనే సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఆరోగ్యం విషమించింది

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైనే సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఆరోగ్యం విషమించింది. ఆయనను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. రంగన్న వివేకానందరెడ్డి హత్య ఇంట్లో వాచ్మెన్ గా ఉన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు ఆయన ఉన్నారు. వివేకా హత్య కేసులో రంగన్నను సీబీఐ కీలక సాక్షిగా పేర్కొంది.
విచారణ జరుగుతున్న...
ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న సమయంలో రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కేసు మీద ప్రభావం చూపుతుందేమోనని భావిస్తున్నారు. రంగన్న గత కొంతకాలంగా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు. రంగన్న వయసు 85 ఏళ్లు కావడంతో వయసు రీత్యా వచ్చే సమస్యలతో పాటు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి.
Next Story

