Fri Dec 05 2025 16:30:35 GMT+0000 (Coordinated Universal Time)
ఒంగోలు బస్టాండ్ ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు
ప్రకాశం జిల్లా ఒంగోలులో బస్టాండ్‌లో ఖాళీగా ఉన్న ఆర్టీసీ బస్సును అపహరించాడో వ్యక్తి.

ప్రకాశం జిల్లా ఒంగోలులో బస్టాండ్‌లో ఖాళీగా ఉన్న ఆర్టీసీ బస్సును అపహరించాడో వ్యక్తి. సమాచారం అందుకున్న పోలీసులు కొద్ది దూరంలోనే బస్సును అడ్డుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూల్-1 డిపోకు చెందిన బస్సును ఒంగోలు బస్టాండ్‌లో పార్కు చేసిన డ్రైవర్ తాళాలను బస్సుకే ఉంచి విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గదికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆ బస్సు ఎక్కి డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్లాడు. బస్టాండ్‌లో ఉన్న కొందరు ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని డిపోలోని ఔట్‌పోస్టు పోలీసులకు తెలిపారు. ఒంగోలులోని కర్నూల్‌రోడ్డు ఫ్లైవోవర్ వద్ద బస్సును పోలీసులు అడ్డుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్సును ఆర్టీసీ బస్టాండ్‌కు, నిందితుడిని ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
News Summary - He hijacked the RTC bus at Ongole bus stand.
Next Story

