Sat Jan 17 2026 04:26:32 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు కాకినాడ జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు.
అమ్మోనియా ప్లాంట్ నిర్మాణానికి...
గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ మొత్తం 495 ఎకరాల్లో నిర్మాణం చేయనున్నారు. ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిని ఈ ప్లాంట్ ద్వారా చేయనున్నారు. కార్బన్ ఉద్గారాలు లేకుండా హైడ్రోజన్ తో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి జరగనుంది. పాల్గొనేందుకు కాకినాడ జిల్లాకు వస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు.
Next Story

