Mon Mar 16 2026 09:22:19 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేటి నుంచి ఒంటిపూట బడులు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు.
మధ్యాహ్న భోజనం...
ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి తిరిగి పాఠశాలలు ముగిసే వరకూ ఒంటి పూట బడులు జరగనున్నాయి.
Next Story

